ఒక్క కమ్యూనిస్టు పార్టీని ఒప్పించడానికి 38 సార్లు ఢిల్లీకి వెళ్లాం: సీఎం కేసీఆర్

  • కఠోర శ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం
  • ఉద్యమంలో ఇక్కడి ప్రజలందరూ భాగస్వాములే
  • టీఆర్ఎస్ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామరక్ష
నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క కమ్యూనిస్టు పార్టీని ఒప్పించడానికి 38 సార్లు ఢిల్లీకి వెళ్లామని, 36 పార్టీల మద్దతు కూడగట్టామని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ, పద్నాలుగేళ్ల కఠోర శ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. ఉద్యమంలో ఇక్కడి ప్రజలందరూ భాగస్వాములేనని చెబుతూ, ఉద్యమాన్ని కాలరాసేందుకు ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. కొత్త రాష్ట్రం, ఆర్థిక  పరిస్థితి, బడ్జెట్ గురించి తెలవదని, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్న సమయంలో పాలనా పగ్గాలు చేపట్టామని, టీఆర్ఎస్ బిడ్డలే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
kcr
kongarakalan

More Telugu News