హెలికాప్టర్ లో ప్రగతి నివేదన సభా ప్రాంగణాన్ని పరిశీలించిన కేసీఆర్
ప్రగతి నివేదన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న కేసీఆర్... కాసేపు హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తూ సభా ప్రాంగణాన్ని వీక్షించారు.
మొత్తం 2000 ఎకరాల్లో సభను నిర్వహిస్తున్నారు. ఇందులో 400 ఎకరాలు సభకు కేటాయించగా, మిగిలిన 1600 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రాంగణాన్ని 15 రోడ్లతో అనుసంధానించారు. సభా ప్రాంగణంలో దాదాపు 30 అంబులెన్స్ లు, 150 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు.