kcr: కొంగరకలాన్ చేరుకున్న కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
ప్రగతి నివేదన సభ జరుగుతున్న కొంగరకలాన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తన నివాసం ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి కొంగరకలాన్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దాదాపు గంటన్నరసేపు ఆయన ప్రసంగం కొనసాగనుంది.

ఇక ఆయన రాకతో సభాప్రాంగణం మొత్తం జై కేసీఆర్ అనే నినాదాలతో మారుమోగుతోంది. సభావేదికపైకి చేరుకున్న కేసీఆర్... తెలంగాణతల్లికి పూలు అర్పించి, నమస్కరించారు. మరోవైపు కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ పరిస్థితిని డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
Go Back to Shorts
kcr
pragathi nivedana sabha

More Telugu News