kongara kalan: ‘మెట్రో’ రైలు పిల్లర్ల నుంచి ఓఆర్ఆర్ వరకూ గులాబీ జెండాల రెపరెపలు!

  • హైదరాబాద్ నగరాన్ని అందంగా అలకరించిన వైనం
  • మెట్రో రైలు పిల్లర్లకు 2000 బ్యానర్లు
  • 40 ప్రధాన రహదారులలో స్వాగతతోరణాలు
  • ఓఆర్ఆర్ చుట్టూ 165 కిలో మీటర్ల మేర జెండాలు
కొంగరకలాన్ ప్రగతి నివేదన సభకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ టీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ నగరాన్ని అందంగా అలకరించారు. అలంకరణ కమిటీ కొన్ని రోజులుగా శ్రమించి నగరాన్ని అందంగా అలంకరించింది. ఈ కమిటీలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండి రమేశ్ వున్నారు.

 సభకు ఆహ్వానం పలుకుతూ మెట్రో రైలు పిల్లర్లకు 2000 బ్యానర్లు, 600 బస్ షెల్టర్లకు ఈ పోస్టర్లను అతికించారు. 700 హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. 40 ప్రధాన రహదారులలో స్వాగతతోరణాలు కట్టగా, 150 చోట్ల ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కటౌట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) చుట్టూ 165 కిలో మీటర్ల మేర జెండాలు కట్టారు. సభా ప్రాంగణం వద్ద 60 అడుగుల ఎత్తుతో సీఎం కటౌట్లు 20 ఏర్పాటు చేశారు.
kongara kalan
decoration

More Telugu News