Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు రామ్ చరణ్ ఇచ్చిన వీడియో గిఫ్ట్ ఇదిగో!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో రామ్ చరణ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్ కి అద్భుతమైన బహుమతిని అందించాడు. ఎంతో సాహసంతో కూడిన పారాగ్లైడింగ్ చేసి, దాన్ని తన బాబాయ్ కి పుట్టినరోజు సందర్భంగా అంకితం చేశాడు.

ఈ వీడియోను ఆయన భార్య ఉపాసన తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా, 'ప్రియమైన బాబాయ్, నా జీవితంలో కాని, సినిమాల్లో కాని సాహసాలు చేసే స్ఫూర్తిని, ధైర్యాన్ని నాకు మీరే ఇచ్చారు. ఈ సాహసం మీ కోసమే. కొందరి సాయంతో ఈ సాహసాన్ని చేశాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు ఇస్తున్న స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి' అంటూ ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Pawan Kalyan
Ramcharan
upasana
para gliding

More Telugu News