YSRCP: నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి!
- ప్రస్తుతం విశాఖపట్నంలో సాగుతున్న జగన్ యాత్ర
- సాయంత్రం జగన్ ను కలవనున్న ఆనం
- వైకాపాలో చేరనున్న నెల్లూరు నేత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత, నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రాంనారాయణరెడ్డి వైసీసీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతుండగా, ఆయన్ను కలవనున్న ఆనం వైకాపా కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి, ఆపై రాష్ట్ర విభజన తరువాత క్రియాశీల రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఆయన ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో కలసి టీడీపీలో చేరినప్పటికీ, తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తిలో ఉన్న ఆయన, సోదరుడి మరణం తరువాత టీడీపీకి మరింత దూరమయ్యారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతుండగా, ఆదివారం సాయంత్రం ఆయన పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించినట్టు ఆనం సన్నిహిత వర్గాలు తెలిపాయి.