Pawan Kalyan: "లగ్జరీ లైఫ్ వదిలేసి..."... పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ మెసేజ్!

  • నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు తెలుపుతున్న టాలీవుడ్ ప్రముఖులు
  • ట్విట్టర్ లో మెసేజ్ పెట్టిన బన్నీ
నేడు తమ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ వైభవంగా జరుపుకుంటుండగా, అల్లు అర్జున్ తన బాబాయ్ కి ట్విట్టర్ వేదికగా శుభాభినందనలు చెప్పాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ లగ్జరీ లైఫ్ ను వదిలేసి, సమాజం కోసం ఆయన పోరాడుతున్నారని బన్నీ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

"పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ, ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ... మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది" అని అన్నాడు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Pawan Kalyan
Tollywood
Allu Arjun
Twitter
Birthday

More Telugu News