Nani: బిగ్ బాస్... ఇద్దరు ఎలిమినేషన్... ఒకరు గణేశ్, ఇంకొకరిపై సస్పెన్స్!

  • బయటకు వెళ్లే వారి వివరాలు రహస్యం
  • నామినేషన్స్ లో ఐదుగురు
  • ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లిపోయిన కౌశల్
తుది దశకు చేరుకున్న తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. వారిలో ఒకరు గణేష్ అని ప్రకటించేశాడు నాని. మరొకరి పేరును సీక్రెట్ గా ఉంచి, అందరికీ షాకిచ్చాడు. నామినేషన్స్ లో ఐదుగురు ఉండగా, అందరూ అనుకున్నట్టుగానే తన ఆర్మీ సాయంతో కౌశల్ గట్టెక్కేశాడు.

కౌశల్ ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్లిపోయాడని చెప్పిన నాని, ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నట్టు చెబుతూ, తొలి పేరుగా గణేష్ ను ప్రకటించాడు. తొలుత ఈ విషయాన్ని ఇంటి సభ్యులెవరూ నమ్మలేదు. నాని మరోసారి చెప్పేసరికి గణేష్, తన వస్తువులను సర్దుకుని బయటకు వచ్చేశాడు. ఇక నేడు మరొకరు ఎలిమినేట్ కానుండగా, ఎవరు బయటకు వస్తారన్న విషయమై సస్పెన్స్ నెలకొని వుంది.
Nani
Biggboss
Kausal
Ganesh
Elimination

More Telugu News