vijay devarakonda: ఆసక్తికరమైన ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ

  • క్రితం నెల 15న విడుదలైన 'గీత గోవిందం'
  • అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లు 
  • ఆదరణ అమేజింగ్ అంటోన్న విజయ్        
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'గీత గోవిందం' .. క్రితం నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. రెండు వారాల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. విజయ్ దేవరకొండ కెరియర్లోనే తొలి 100 కోట్ల సినిమా అనే ఘనతను సాధించింది.

ఈ సినిమాకి ఈ స్థాయి విజయం లభించడం పట్ల విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'నా తొలి సెంచరీని నా కోచింగ్ స్టాఫ్ గీతా ఆర్ట్స్ కి .. కెప్టెన్ బుజ్జికి .. నా పార్ట్నర్ హీరోయిన్ రష్మిక మందనకు .. అంకితం ఇస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ ప్రేక్షకుల ఆదరణ అమేజింగ్ గా వుంది .. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది' అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నోటా' .. 'టాక్సీవాలా' చిత్రాలు సిద్ధమవుతున్నాయి.       
vijay devarakonda

More Telugu News