smartphone: నాలుగు కెమెరాలు, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్ తో హువావే నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల!

షార్ట్స్‌లో చూడండి
చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హువావే మేట్ 20 లైట్‌' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్ ని తాజాగా బెర్లిన్‌లో జరిగిన 'ఐఎఫ్‌ఏ 2018' కార్యక్రమంలో విడుదల చేసింది. హైసిలికాన్ కిరిన్ 710 లాంటి అధునాతన ప్రాసెసర్‌ తో పాటు నాలుగు కెమెరాలని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. గోల్డ్, బ్లాక్, బ్లూ కలర్ లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

హువావే మేట్ 20 లైట్‌ ప్రత్యేకతలు:

  • 6.3" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే(19.5:9)
  • 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • హైసిలికాన్ కిరిన్ 710 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 20/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24/2 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
  • ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
  • 3750ఎంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
smartphone
Tech-News
China
berlin
India
technology

More Telugu News