Harish Rao: టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుంది?: హరీష్ రావు

  • తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా?
  • ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు ప్రజలు గుర్తుకొస్తారు
  • కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోంది
తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్ ను ఓడించాలని భావిస్తున్నాయని.... ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్ కే ఉందని, ఓటర్లు టీఆర్ఎస్ కే పట్టం కడతారని చెప్పారు. ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలకు... ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. కొంగరకలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు తరలి వెళ్తున్న ట్రాక్టర్లను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని హరీష్ తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


Harish Rao
congress
TRS
Telugudesam
kcr

More Telugu News