ysr: పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్సే!: అంబటి రాంబాబు

  • సంక్షేమ పథకాల రూపకర్త వైయస్సే
  • పోలవరం ప్రాజెక్టు వైయస్ పుణ్యమే
  • ముస్లిం ద్రోహి చంద్రబాబు
మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని... అందుకే ఆయనను 'వైయస్సార్ హమారా' అని ముస్లింలు గుండెల్లో పెట్టుకున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. సంక్షేమ పథకాల రూపకర్త వైయస్సే అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. డిమాండ్లను లేవనెత్తితే కేసులు పెట్టి, వేధిస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి అని, బీజేపీతో ఆయన అంటకాగింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైయస్సేనని అంబటి తెలిపారు. వైయస్ పుణ్యమే పోలవరం ప్రాజెక్టని చెప్పారు. వైయస్ మరణం ఒక విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక అనేక మంది రోదించారని, మరికొందరు ప్రాణాలు కూడా విడిచారని చెప్పారు.

ysr
Chandrababu
ambati rambabu
polavaram

More Telugu News