భయపడొద్దు తమ్మూడూ.. పెద్ద దిక్కుగా నేనున్నా!: రామ్మూర్తి నాయుడికి ధైర్యం చెప్పిన చంద్రబాబు
- చిత్తూరులో పర్యటిస్తున్న ఏపీ సీఎం
- తమ్ముడు రామ్మూర్తి ఇంటికెళ్లిన బాబు
- స్థానికులతో మాట్లాడి సెల్ఫీలు
అధికారులను బయటే ఉండమని చెప్పిన చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి తమ్ముడు రామ్మూర్తి నాయుడితో పాటు ఆయన కుమారుడు, హీరో నారా రోహిత్ తో మాట్లాడారు. తమ్ముడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా తాను ఉన్నాననీ, భయపడవద్దని చంద్రబాబు తమ్ముడికి ధైర్యం చెప్పారు. దాదాపు 20 నిమిషాల సేపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం బయటికొచ్చిన సీఎం.. చుట్టుపక్కల వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు.