varnished currency: కొత్త కరెన్సీ నోట్లను తీసుకురానున్న ఆర్బీఐ!

  • చింపినా చిరగవు.. తడిపినా తడవవు
  • ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ
  • ప్రయోగాత్మకంగా వార్నిష్డ్ నోట్లు 
పెద్ద నోట్ల రద్దుతో ఆర్బీఐ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొత్త నోట్ల ముద్రణకు భారీగా ఖర్చవుతోంది. దీనికి తోడు నకిలీ నోట్ల బెడద కూడా తీవ్రంగానే ఉంది. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందే దిశగా ప్రస్తుతం ఆర్బీఐ అడుగులు వేస్తోంది. చింపినా చిరగకుండా, తడిపినా తడవకుండా ఉండేలా కొత్త కరెన్సీ ముద్రణకు సిద్ధమైంది. అదే... వార్నిష్డ్ కరెన్సీ. ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయి. అంతేకాదు, నోట్ల సెక్యూరిటీ ఫీచర్స్ కోసం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.

'మన కరెన్సీ మన్నికను పెంచేందుకు ఆర్బీఐ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. వార్నిష్డ్ నోట్లకు జీవితకాలం ఎక్కువ ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పాత నోట్లను రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సెక్యూరిటీ ఫీచర్స్ కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. ప్రయోగాత్మకంగా వార్నిష్డ్ నోట్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించాం' అని ఆర్బీఐ ప్రకటించింది. 
varnished currency
rbi

More Telugu News