chiranjeevi: 'సైరా'కోసం టబూను ఒప్పించే ప్రయత్నాల్లో చరణ్

  • షూటింగు దశలో 'సైరా'
  • కీలక పాత్ర కోసం టబూతో సంప్రదింపులు 
  • ఆమధ్య 'పాండురంగడు'లో నటించిన టబు  
చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో 'సైరా' సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. చారిత్రక నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో అమితాబ్ .. నయనతార .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో 'టబూ' కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

ఇంకా టబూతో సంప్రదింపులు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. చరణ్ .. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టబూ ఓకే అంటే త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలుగులో బాలకృష్ణతో చేసిన 'పాండురంగడు' ఆమె చివరి చిత్రం. టబూ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే .. 'పాండురంగడు' తరువాత ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది.     
chiranjeevi
nayanathara
tabu

More Telugu News