srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం!

  • ఆలయం ముందు భాగంలో మంటలు
  • తీవ్రంగా శ్రమించి ఆర్పిన సిబ్బంది
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈవో ఆఫీస్ ముందుభాగంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆలయం ముందు ఏర్పాటు చేసుకున్న 15 దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


మంటలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోని రూ.15 లక్షల విలువైన సరుకులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
srisailam
Fire Accident

More Telugu News