Polavaram project: 6న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్ర బృందం

  • 5న విజయవాడకు రానున్న కమిటీ
  • 6న పోలవరంలో పర్యటన
  • 7న విజయవాడలో సమీక్ష
ఈ నెల ఐదో తేదీన కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ పోలవరం పర్యటనకు రానుంది. శర్మ నేతృత్వంలోని కమిటీ 5న విజయవాడ చేరుకుని 6న ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. అనంతరం 7న విజయవాడలో ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస కమిషనర్ రేఖారాణి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాజెక్టు అంచనాలపై ఆమె పంపే నివేదిక ప్రకారం.. గతంలో ఇచ్చిన గణాంకాలు, కొత్త అంచనాల మధ్య తేడాలను ఈఎన్‌సీ బృందం పరిశీలిస్తుంది. ఈ నివేదిక పక్కాగా ఉందని కనుక కమిటీ భావిస్తే దానిని  పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు పంపిస్తారు.
Polavaram project
Andhra Pradesh
Chandrababu
Vijayawada

More Telugu News