Allu Arjun: ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దు: వైఎస్ జగన్

  • త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడటంపై జగన్ దిగ్భ్రాంతి
  • అతని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
  • పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందాం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ విశాఖపట్నం జిల్లా కాగిత గ్రామానికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందామని, ఎవరూ ప్రాణత్యాగాలకు మాత్రం పాల్పడవద్దని సూచించారు.

‘అయ్యా, సీఎం గారు, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే, నా మరణానికి ఒక అర్థం..’ అని త్రినాథ్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి విదితమే.
Allu Arjun
nani

More Telugu News