Balakrishna: భోజనం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

  • ఏకమవుతున్న నందమూరి కుటుంబసభ్యులు
  • వీడిపోతున్న చిన్నిచిన్ని విభేదాలు
  • అబ్బాయితో ఆప్యాయంగా మాట్లాడిన బాబాయ్
నందమూరి కుటుంబంలో వివాదాలన్నీ సమసిపోయినట్టే కనిపిస్తోంది. హరికృష్ణ మరణం కుటుంబసభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను తుడిచిపెట్టేసింది. కుటుంబసభ్యులందరూ ఒకరికి మరొకరు తోడున్నామన్నంతగా ఏకమైపోయారు. హరికృష్ణ భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాన మోయడం అందరికీ సంతోషం కలిగేలా చేసింది.

ఈరోజు మధ్యాహం హరికృష్ణ నివాసం వద్ద పలువురు ప్రముఖులు భోజనాలు చేస్తున్న సమయంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భోజనాలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల వద్దకు వెళ్లిన బాలయ్య... వారిద్దరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాలయ్య మాట్లాడుతుంటే తారక్ ఎంతో వినయంగా వింటుండటం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నందమూరి అభిమానులు 'మేమంతా ఒకటే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2F100006841185084%2Fvideos%2F2314948475409836%2F&show_text=0&width=261" width="261" height="476" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>
Balakrishna
junior ntr
tarak
kalyan ram
tollywood
nandamuri
fans

More Telugu News