colours swathi: ప్రేమ వివాహం చేసుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి... వీడియో చూడండి

షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరపై కలర్స్ స్వాతిగా సందడి చేసి, ఆ తర్వాత సినీ హీరోయిన్ గా మారిన స్వాతిరెడ్డి తన ప్రియుడు వికాస్ ను పెళ్లి చేసుకుంది. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తున్న వికాస్ ను పెళ్లాడింది. తమ ప్రేమను ఇంట్లో ఒప్పించి, పెద్దల ఆశీస్సులతో ఒక ఇంటిదయింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

ఇక సెప్టెంబర్ 2న కొచ్చిలో కొత్త జంట రిసెప్షన్ ఇవ్వనుంది. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా పలు రంగాల్లో రాణించిన స్వాతి... పెళ్లి తర్వాత ఏం చేయబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. నటిగా తన కెరీర్ ను కొనసాగిస్తుందా? లేక కుటుంబ బాధ్యతలకే పరిమితమవుతుందా? అనే విషయం వేచి చూడాలి.
Go Back to Shorts
colours swathi
swathi reddy
marriage
tollywood

More Telugu News