Chandrababu: ముస్లిం అభ్యర్థికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరాం: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

  • ప్రత్యర్థి పార్టీ సభల్లో అల్లర్లు చేయడం వైసీపీకి అలవాటే
  • తుని ఘటన తరహాలో గొడవకు పథకం వేశారు
  • వచ్చే ఎన్నికలలో ‘జనసేన’కు ఒక్క సీటూ రాదు
గుంటూరులో ఇటీవల నిర్వహించిన  ‘నారా హమారా- టీడీపీ హమారా’ కార్యక్రమంలో తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం పన్నిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీ సభల్లో అల్లర్లు చేయడం జగన్ కే కాదు, ఆయన తాత, తండ్రికీ అలవాటేనని, జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని విమర్శించారు. వచ్చే ప్రభుత్వంలో ముస్లిం అభ్యర్థికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క సీటూ రాదని, క్షేత్ర స్థాయిలో ఏమాత్రం బలం లేని ‘జనసేన’ పార్టీ ఎలా గెలుస్తుందని జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
Chandrababu
mla
jaleelkhan

More Telugu News