Jagan: కోర్టుకు హాజరైన జగన్, గాలి జనార్దన్ రెడ్డి

  • జగన్ తో పాటు సబిత, వైవీ, శ్రీలక్ష్మిలు హాజరు
  • పాదయాత్రకు ఒక రోజు విరామమిచ్చిన వైసీపీ అధినేత
  • అక్రమ మైనింగ్ కేసులో కోర్టుకు హాజరైన గాలి
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జగన్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిలు కూడా కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖపట్టణం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోర్టు విచారణ నేపథ్యంలో పాదయాత్రకు ఆయన ఒకరోజు విరామం ప్రకటించారు. మరోవైపు, అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.
Jagan
court
gali janardhan reddy

More Telugu News