Mahesh Babu: దర్శకురాలు జయ మరణ వార్త విని, షూటింగ్ ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ కు మహేష్ బాబు!

  • గుండెపోటుతో మరణించిన దర్శకురాలు జయ
  • 'మహర్షి' షూటింగ్ లో బిజీగా మహేష్ బాబు
  • హైదరాబాద్ కు వచ్చి నివాళులు
ప్రముఖ దర్శకురాలు, సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు సతీమణి జయ ఆకస్మిక మరణ వార్తను విని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ప్రస్తుతం తన కొత్త చిత్రం 'మహర్షి' షూటింగ్ లో ఉన్న ఆయన, షూటింగ్ ఆపేసి హైదరాబాద్ వచ్చి, జయ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. జయ మరణం వ్యక్తిగతంగా తనకెంతో లోటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మహేష్ బాబు నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు బీఏ రాజు పత్రికా సంబంధాల అధికారిగా వ్యవహరించి, సినిమాల ప్రమోషన్ బాధ్యతలను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. 
Mahesh Babu
Tollywood
Director
Jaya
BA Raju

More Telugu News