Rajinikanth: నావి ఆధ్యాత్మిక రాజకీయాలు.. సంఘవిద్రోహ శక్తులకు నా పార్టీలో చోటులేదు: రజనీకాంత్

  • కుల, మతాల పేరుతో రాజకీయాలకు దూరం
  • అటువంటి వారిని చేర్చుకోబోను
  • క్రమశిక్షణతో మెలిగే వారికే నా పార్టీలో భవిష్యత్తు
ఎన్నో ఏళ్లపాటు ఊగిసలాడి చివరికి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై మరింత స్పష్టత ఇచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ కుల రాజకీయాలకు తాను ఆమడ దూరం ఉంటానని స్పష్టం చేశారు. కులం పేరుతో రాజకీయాలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీలో చేర్చుకోబోనన్నారు. తనవి ఆధ్యాత్మిక రాజకీయాలని పేర్కొన్న రజనీకాంత్.. కులమతాల పేరుతో చేసే రాజకీయాలకు తాను దూరంగా ఉంటానన్నారు. సంఘ విద్రోహ శక్తులకు తన పార్టీలో చోటుండదని తేల్చి చెప్పారు. క్రమశిక్షణతో మెలిగే వారికే తన పార్టీలో భవిష్యత్తు ఉంటుందని రజనీకాంత్ స్పష్టం చేశారు.

Rajinikanth
Tamilnadu
Chennai
Party
Politics

More Telugu News