hari krishna: ఎవరికీ చెప్పకుండా.. ఢిల్లీలో సర్జరీ చేయించుకున్న హరికృష్ణ!

  • బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న హరికృష్ణ
  • విషయం తెలుసుకుని ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరిన కల్యాణ్ రామ్
  • ఆపరేషన్ ద్వారా 30 కేజీల బరువు తగ్గిన వైనం
హరికృష్ణ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బరువు తగ్గడం కోసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆయన సర్జరీ చేయించుకున్నారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న కుమారుడు కల్యాణ్ రామ్ ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లారు. మరుసటి రోజు హరికృష్ణ భార్య, కుమార్తెలు ఢిల్లీలో వాలిపోయారు. ఆపరేషన్ కు ముందు హరికృష్ణ 107 కిలోల బరువు ఉన్నారు. ఆపరేషన్ ద్వారా 30 కేజీల బరువు తగ్గారు.

రాజ్యసభ సమావేశాలకు కూడా హరికృష్ణ విధిగా హాజరయ్యేవారు. సమావేశాలు ప్రారంభమయ్యే నాడు ఢిల్లీకి వెళ్తే... సమావేశాలు పూర్తైన తర్వాతే తిరిగి హైదరాబాదుకు వచ్చేవారు. సభా సమయాన్ని కూడా నిక్కచ్చిగా పాటించేవారు.
hari krishna
beriatric surgery

More Telugu News