hari krishna: సీతక్కా అంటూ నన్ను ఆప్యాయంగా పిలిచేవాడు!: నటి గీతాంజలి

  • చిన్నప్పటి నుంచి కలసి ఆడుకునేవాళం
  • ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పాడు
  • అర్థాంతరంగా వెళ్లిపోయాడు 
దివంగత హరికృష్ణకు నివాళి అర్పించిన అనంతరం సీనియర్ నటి గీతాంజలి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సీతక్కా అంటూ తనను ఆప్యాయంగా పిలిచేవాడని, ఇప్పుడిలా హఠాత్తుగా అందరిని వదిలివెళ్లి పోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. 'సీతారామ కల్యాణం' చిత్రంలో సీతగా నటించిన తనను హరికృష్ణ ఎప్పుడూ సీతక్కా అని పిలిచేవాడని తెలిపారు.

చిన్నప్పటి నుంచి హరికృష్ణ, బాలయ్యబాబులతో కలసి ఆడుకునే వాళ్లమని... బాలయ్య ఎంతో సాఫ్ట్ గా ఉంటే, హరి బాగా అల్లరి చేసేవాడని చెప్పారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హరి తనతో చెప్పాడని, అయితే ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడని ఆవేదన చెందారు.  
hari krishna
geetanjali

More Telugu News