hari krishna: పెళ్లికి మాత్రమే కాదు.. మరో కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సిన హరికృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లా కావలిలో తన స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళ్తూ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఆయన నెల్లూరులో మరో కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సి ఉంది. నగరంలోని ఇస్కాన్ సిటీలో ఈరోజు ఒక అపార్ట్ మెంట్ శంకుస్థాపనకు ఆయన హాజరు కావాలి.

గతంలో గూడురులో ఒక అపార్ట్ మెంట్ కు కూడా హరికృష్ణ చేతుల మీదుగానే సదరు వ్యక్తి శంకుస్థాపన చేయించారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కూడా హరిని ఆహ్వానించారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రేణిగుంట వరకు ప్రయాణించడానికి ఆయనకు ఫ్లైట్ టికెట్లు కూడా పంపించారు. అయితే, తాను బుధవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా నెల్లూరుకు వస్తానని హరి చెప్పారు. బుధవారం ఉదయం ఆయన నెల్లూరుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.
Go Back to Shorts
hari krishna

More Telugu News