hari krishna: నేను, హరికృష్ణ సరదాగా మాట్లాడుకునేవాళ్లం: రేణుకా చౌదరి

  • హర్యాణాలో కూడా చైతన్య రథాన్ని ఆయనే నడిపారు
  • ఎంతో మందిని దగ్గరకు తీసుకున్నారు
  • ఆయన మరణం సమాజానికి తీరని లోటు
రాజ్యసభలో తాను, హరికృష్ణ సరదాగా మాట్లాడుకునేవాళ్లమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని ఎప్పుడూ హరికృష్ణే నడిపేవారని చెప్పారు. హర్యాణాలో ఎన్టీఆర్ పర్యటించినప్పుడు కూడా హరికృష్ణే చైతన్య రథాన్ని నడిపారని... ఎన్టీఆర్ కుమారుడే డ్రైవింగ్ చేస్తున్నాడంటే హర్యాణా ప్రజానీకం నమ్మలేకపోయారని తెలిపారు. ఎంతో మందిని పెద్ద మనసుతో దగ్గరకు తీసుకున్న గొప్ప వ్యక్తి హరికృష్ణ అని చెప్పారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు అని అన్నారు. సొంత కుటుంబసభ్యుడిలా బతికిన వ్యక్తిని మన భుజాలపైనే తీసుకువెళ్తున్నట్టు ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 
hari krishna
renuka chowdary

More Telugu News