Harikrishna: ఆ టిఫినేదో తొందరగా తిన్నా హరికృష్ణ బతికుండేవారు!

  • కావలిలో వివాహనికి అనుచరులతో కలసి బయలుదేరిన హరికృష్ణ
  • కారును తాను నడుపుతానన్న వెంకట్రావ్
  • టిఫిన్ చేసిన తరువాత ఇస్తానన్న హరికృష్ణ.. అంతలోనే ప్రమాదం
రావి వెంకటరావు, శివాజీ... ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే. హరికృష్ణకు అత్యంత సన్నిహితులే. ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరినీ పిలిచి, వారితో పాటు వెళ్లేవారు హరికృష్ణ. నిన్న నెల్లూరు జిల్లా కావలిలో జరగనున్న తన మిత్రుడి కుమారుని వివాహ వేడుకకు బయలుదేరే వేళ కూడా వీరిద్దరినీ పిలిచారు. తెల్లవారుజామునే బయలుదేరాలని ముందే చెప్పారు. తన ఇంటి నుంచి కారు తీసుకుని, వారిద్దరినీ పికప్ చేసుకున్నారు.

వాస్తవానికి హరికృష్ణకు శస్త్ర చికిత్సలు జరిగినప్పటి నుంచి వాహనాలను నడపడం
లేదు. ఈ విషయం వెంకట్రావుకు, శివాజీకీ తెలుసు. దీంతో కారును తాను నడుపుతానని వెంకట్రావు కోరారు. ప్రస్తుతానికి తానే నడుపుతానని, టిఫిన్ కు ఎక్కడైనా ఆగి, చేసిన తరువాత, నువ్వు డ్రైవ్ చేద్దువులే అని హరికృష్ణ చెప్పారట. ఆపై గంట వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది. టిఫిన్ చేయడానికి ఆగుంటే హరికృష్ణ ప్రాణాలు నిలబడేవని నిన్నటి ఘటనను గుర్తు చేసుకుని విలపిస్తున్నారు ఆయన అనుచరులు.
Harikrishna
Venkatarao
Tifin
Road Accident

More Telugu News