Madhya Pradesh: 19 ఏళ్ల వయసులోనే మరో పూలన్ దేవిగా మారిన సాధనా పటేల్.. పట్టిస్తే నజరానా ప్రకటించిన పోలీసులు!

  • తండ్రి మరణంతో మేనత్త వద్ద పెరుగుతున్న సాధన
  • ఎన్ కౌంటర్ లో మరణించిన మేనత్త సన్నిహిత దోపిడీ దొంగ చున్నీలాల్
  • ఆయన వారసత్వాన్ని స్వీకరించి హడలెత్తిస్తున్న సాధన
ఆమె వయసు కేవలం పందొమ్మిదేళ్లు. పేరు సాధనా పటేల్. మధ్యప్రదేశ్ లో మరో పూలన్ దేవిగా మారింది. అరాచకాలు సృష్టిస్తూ హడలెత్తిస్తోంది. అమెను పట్టిస్తే రూ. 10 వేల నజరానా ఇస్తామని మధ్యప్రదేశ్ పోలీసులు అంటున్నారు. తన మేనత్తకు సన్నిహితుడైన బందిపోటు దొంగ చున్నీలాల్ పటేల్, పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించడంతో ఆమె వద్ద పెరిగిన సాధన, వారసత్వాన్ని స్వీకరించింది.

 నయాగామ్ ప్రాంతాన్ని దోపిడీలతో హడలెత్తిస్తోంది. చోట్కుసేన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, అతని చేతి వేళ్లను తెగనరికి డబ్బులు గుంజుకుంది. బరాహియా ప్రాంతానికి చెందిన ఆమె, తన తండ్రి మరణం తరువాత మేనత్త సంరక్షణలో పెరిగింది. ఇప్పుడు దోపిడీ దొంగల ముఠాకు రాణిగా మారి, ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు, ఇలా 19 ఏళ్ల యువతి కోసం రివార్డు ప్రకటించడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
Madhya Pradesh
Sadhana Patel

More Telugu News