hari krishna: హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ఓ ప్రత్యేకత ఉంది!: సీఎం చంద్రబాబు

  • హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకత ఉంది
  • ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయతీగా పని చేశారు
  • అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు
నందమూరి హరికృష్ణ కారు నడుపుతుండగా మంచి నీళ్లు తాగే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ భౌతికకాయం ఉన్న నివాసం నుంచి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, హరికృష్ణ కారు డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపున బోల్తా పడిందని అన్నారు.

వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం హరికృష్ణ నైజమని, హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకత ఉందని, ఆయన ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయతీగా పని చేశారని కొనియాడారు. అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
hari krishna
Chandrababu

More Telugu News