hari krishna: అంత్యక్రియలకు ఏ లోటు రానివ్వం.. అన్ని ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్

  • హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తాం
  • ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తాం
  • ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు
తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో దివంగత హరికృష్ణ అంత్యక్రియలను ఏ లోటు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. హరికృష్ణను కడసారి చూసేందుకు వచ్చే ఏ ఒక్కరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. సోదరులు తారక్, కల్యాణ్ రామ్ లతో పాటు నందమూరి కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు.
hari krishna
funerals
KTR
kcr

More Telugu News