hari krishna: నాడు ఎన్టీఆర్ మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరించింది హరికృష్ణే!

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లాలోని హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో జరిగిన ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన హరికృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఘనత హరికృష్ణదే.

 నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.లక్ష్మినారాయణరెడ్డిపై భారీ మెజారిటీ (62 వేల)తో నందమూరి హరిక‌ష్ణ విజయం సాధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరించింది హిందూపురంలోనే. నాడు ఎమ్మెల్యే హోదాలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించింది హరికృష్ణే. హిందూపురానికి 1996 నుంచి నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న హరికృష్ణ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
Go Back to Shorts
hari krishna
ntr

More Telugu News