kcr: జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకున్న కేసీఆర్

  • హరికృష్ణకు ఘన నివాళి అర్పించిన కేసీఆర్
  • పక్కనే ఉన్న తారక్ ను హత్తుకున్న ముఖ్యమంత్రి
  • కల్యాణ్ రామ్ ను పరామర్శించిన సీఎం
దివంగత హరికృష్ణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలకు వెళ్లిన కేసీఆర్... హరికృష్ణ భౌతికకాయం వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ను పరామర్శించారు. హరికృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, నమస్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పక్కనే చంద్రబాబు కూడా ఉన్నారు. హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
kcr
Chandrababu
junior ntr
tarak
kalyanram
hari krishna

More Telugu News