hari krishna: ఫామ్ హౌస్ లో కాదు.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

  • మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అంత్యక్రియలంటూ తొలుత వార్తలు
  • రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు
  • తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

దివంగత హరికృష్ణ అంత్యక్రియలు మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో జరగనున్నాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగడం లేదు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు సాయంత్రం ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఆయన అంతిమయాత్ర కోసం చైతన్య రథం సిద్ధమవుతోంది. కాసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. 

hari krishna
funerals
place
mahaprasthanam
  • Loading...

More Telugu News