harikrishna: విలపిస్తూ హరికృష్ణ నివాసానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తల్లి

  • కన్నీరుమున్నీరవుతున్న ఎన్టీఆర్ తల్లి శాలిని
  • ఏడుస్తున్న ఆమెను చేయి పట్టుకుని తీసుకొచ్చిన లక్ష్మీప్రణతి
  • కాసేపట్లో ఇంటికి చేరనున్న పార్థివదేహం
తన భర్త హరికృష్ణ ఇక లేరనే వార్తతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని కన్నీరుమున్నీరవుతున్నారు. తన కోడలు లక్ష్మీప్రణతితో కలసి హరికృష్ణ నివాసానికి ఆమె చేరుకున్నారు. ఏడుస్తున్న ఆమెను లక్ష్మీప్రణతి చేయిపట్టుకుని ఇంటిలోకి తీసుకెళ్లారు. మరోవైపు కాసేపట్లో హరికృష్ణ భౌతికకాయం ఆయన నివాసం వద్దకు చేరుకోనుంది. ఇంటి వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా చాలా మటుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు పార్థివదేహం చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని భారీ సంఖ్యలో వాహనాలు అనుసరిస్తున్నాయి.
harikrishna
junior ntr
shalini
mother

More Telugu News