paritala sunitha: పరిటాల రవి అడగ్గానే హరికృష్ణ ఒప్పుకున్నారు: పరిటాల సునీత

  • రవికి, హరికృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి
  • తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారు
  • రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల ఏపీ మంత్రి పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో హరికృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యేగా పని చేసిన హరికృష్ణ... అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని అన్నారు. 'శ్రీరాములయ్య' సినిమాలో సత్యం క్యారెక్టర్ లో మీరు నటించాలని హరికృష్ణ అడగ్గానే... ఆయన ఒప్పుకుని, సినిమాలో నటించారని చెప్పారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని సునీత అన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారని తెలిపారు. పరిటాల రవి, హరికృష్ణకు మధ్య మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. 
paritala sunitha
paritala ravi
harikrishna

More Telugu News