Balakrishna: హరికృష్ణ మృతదేహం వెంట బాలయ్య, త్రివిక్రమ్

  • హైదరాబాద్ కు బయలుదేరిన అంబులెన్స్
  • వెంట భారీ కాన్వాయ్ లో పలువురు ప్రముఖులు
  • ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు
నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం, ఆయన భౌతికకాయాన్ని ఉంచిన అంబులెన్స్ వాహనం హైదరాబాద్ కు బయలుదేరింది. అంబులెన్స్ లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూర్చున్నారు. పోలీసుల ఎస్కార్ట్, పలువురు వీఐపీల వాహనాలు ఈ కాన్వాయ్ లో ఉన్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల వాహనాలు కూడా ఈ కాన్వాయ్ లో ఉన్నాయి. దీంతో మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటి వరకూ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, నాంపల్లి, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో కాన్వాయ్ ప్రయాణం సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. 
Balakrishna
Harikrishna
Jr Ntr
Chandrababu
Kalyan Ram
Trivikram Srinivas

More Telugu News