harikrishna: హరికృష్ణ భౌతికకాయానికి ముగిసిన పోస్ట్ మార్టం.. ఇంటికి తరలింపు.. హైదరాబాద్ వరకు రూట్ క్లియరెన్స్
- నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో పూర్తైన పోస్ట్ మార్టం
- భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన వైద్యులు
- పార్థివదేహం హైదరాబాదుకు తరలింపు
నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి పోస్ట్ మార్టం పూర్తయింది. భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వైద్యులు అందజేశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాదుకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా... పోలీసులు రూట్ క్లియరెన్స్ ఇచ్చారు.
నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఉదయం 6.15 గంటలకు హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో స్వయంగా ఆయనే కారును డ్రైవ్ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణంతో సినీ, రాజకీయ రంగాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.