Chandrababu: భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన చంద్రబాబు

  • హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు
  • కంటతడి పెట్టిన చంద్రబాబు, లోకేష్
  • కొనసాగుతున్న పోస్ట్ మార్టం
హరికృష్ణ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రత్యేక హెలికాప్టర్ లో హుటాహుటిన నల్గొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన చంద్రబాబు, లోకేష్ లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుతం హరికృష్ణ భౌతికకాయానికి పోస్ట్ మార్టంను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాలయ్య, భువనేశ్వరి, తారక్, కల్యాణ్ రామ్, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.
Chandrababu
Nara Lokesh
harikrishna

More Telugu News