KCR: తట్టుకోలేకపోతున్నా... హరికృష్ణ హఠాన్మరణంపై స్పందించిన కేసీఆర్.!

  • ప్రమాదం గురించి తెలియగానే యోగక్షేమాలు అడిగా
  • కాసేపటికే మరణించారన్న వార్త తెలిసింది
  • హరికృష్ణ తనకు సన్నిహితుడన్న కేసీఆర్
ఈ ఉదయం నిద్ర లేవగానే హరికృష్ణ కారుకు జరిగిన ప్రమాదం గురించి తనకు తెలిసిందని, ఆ వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకోవాలని పురమాయించానని, కాసేపటికే ఆయన మరణించారన్న వార్త తెలిసి తట్టుకోలేకపోయానని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన, ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

సినీ రాజకీయాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివన్న కేసీఆర్, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.
KCR
Harikrishna
Road Accident
Condolence

More Telugu News