murder: ఆరేళ్లుగా కట్నం ఇవ్వని అత్త.. కసితో గొంతు కోసిన అల్లుడు!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • 4 సెంట్ల భూమిని ఇస్తానన్న అత్త
  • ఇవ్వకపోవడంతో కిరాతకంగా హత్య
ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని భార్యలను వేధించిన ఘటనలను మనం చూసుంటాం. కానీ కట్నం ఇవ్వలేదన్న కారణంతో ఓ ప్రబుద్ధుడు ఏకంగా పిల్లనిచ్చిన అత్తనే హతమార్చాడు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన చిలకలపూడి దుర్గాప్రసాద్, అదే గ్రామానికి చెందిన పొన్నమండ శశిప్రియను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో నాలుగు సెంట్ల భూమిని కట్నంగా ఇస్తానని శశిప్రియ తల్లి విష్ణుకుమారి(48) మాటిచ్చింది. వివాహమయ్యాక కూడా ఈ పొలాన్ని అప్పగించకపోవడంపై అత్తాఅలుళ్ల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా విష్ణుకుమారితో దుర్గాప్రసాద్ గొడవ పడ్డాడు. అనంతరం కత్తితో కడుపులో పొడిచి గొంతు కోసి కిరాతకంగా హతమర్చాడు. తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై అమలాపురం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
murder
East Godavari District
aunt
amalapuram

More Telugu News