Purandeshwari: సోదరుడి మరణవార్త విని కన్నీటి పర్యంతమైన పురందేశ్వరి!

  • మెహిదీపట్నంలోని ఇంటికి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి
  • ఒక్కొక్కరుగా చేరుతున్న బంధుమిత్రులు
  • పోస్టుమార్టం అనంతరం స్వగృహానికి హరికృష్ణ భౌతికకాయం
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణవార్తను విని ఆయన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్, మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి తన భర్త వెంకటేశ్వరరావుతో కలసి చేరుకున్నారు. హరికృష్ణ భార్యను ఓదార్చేందుకు పలువురు బంధుమిత్రులు ఇప్పటికే వారింటికి చేరుకోగా, కామినేని ఆసుపత్రిలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉన్నారు. హరికృష్ణ కారు రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తుండగా, ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగృహానికి తరలించనున్నారు.
Purandeshwari
Harikrishna
Road Accident

More Telugu News