ప్రమాదం సమయంలో హరికృష్ణ కారు వేగం గంటకు 160 కి.మీ.!
- తలకు బలమైన గాయం
- రక్తం చాలాపోయింది
- మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు
- వెల్లడించిన ఎస్పీ రంగనాథ్
కారులో ఆయనతో పాటు మరో నలుగురు ఉండగా, ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని, విషయం తెలుసుకున్న వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశామని అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి, వందలాది మందిని బలిగొన్న సంగతి తెలిసిందే.