jagan: మీ ఇద్దరూ బీజేపీతో ఎందుకు లాలూచీ పడుతున్నారు?: జగన్, పవన్ లపై నారా లోకేశ్ ధ్వజం

  • బీజేపీతో వాళ్లిద్దరూ లాలూచీ పడుతున్నారు
  • నాపై లేనిపోని ఆరోపణలు చేశారు
  • దమ్ముంటే.. ఆ ఆరోపణలు నిరూపించాలి
వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గుంటూరులో జరుగుతున్న ‘నారా హమారా.. టీడీపీ హమారా’ బహిరంగసభలో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధమని చెప్పిన జగన్, పవన్ లు తమ మాటపై నిలబడలేదని, బీజేపీతో లాలూచీ పడుతున్నారని, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

జగన్, పవన్ లు తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, ఈ సభా వేదికగా వారిద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నానని, వాళ్లిద్దరికి దమ్ముంటే ఆ ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూసే వాళ్లను తరిమి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపు నిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎంతగానో పాటుపడుతున్నారని, కేంద్రం సాయం చేయకపోయినా, పట్టుదలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత బాబుదని ప్రశంసించారు. 
jagan
Pawan Kalyan
lokesh

More Telugu News