Pawan Kalyan: పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలు మార్ఫింగ్.. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • అసభ్యకర రీతిలో పవన్ తల్లి ఫొటోలు అప్ లోడ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రావణ్ అనే వ్యక్తి
  • ఐపీ అడ్రస్ కనుగొనే ప్రయత్నంలో పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... 'చంటిఅబ్బాయ్' అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన శ్రావణ్ అనే వ్యక్తి ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు... ఫొటోలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.

మరోవైపు, ఈ అంశంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ తల్లిని వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Pawan Kalyan
mother
photos
morphing
tollywood
janasena

More Telugu News