mohanbabu: హీరోగా సూర్య .. విలన్ గా మోహన్ బాబు!

  • గతంలో విలన్ గా మెప్పించిన మోహన్ బాబు
  • ఆ తరువాత హీరోగా హవా 
  • కొత్తదనం కోసం మరోసారి విలన్ పాత్ర        
తెలుగు తెరపై తమదైన శైలిలో విలనిజాన్ని పండించినవారిలో మోహన్ బాబు ఒకరుగా కనిపిస్తాడు. హీరోగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించడం మొదలుపెట్టిన తరువాత విలన్ తరహా పాత్రలవైపు ఆయన దృష్టి పెట్టలేదు. అసలు అంత సమయం కూడా ఆయనకి లేదు. ఆ మధ్య మాత్రం 'రౌడీ'లో విలన్ షేడ్ కలిగిన పాత్రలో మెప్పించారు.

ఇక ఇటీవల కాలంలో కొత్తదనంతో కూడిన విభిన్నమైన పాత్రలను పోషించడానికి ఆయన మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మరోమారు విలన్ పాత్రను చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సూర్య హీరోగా సుధా కొంగర ఒక సినిమాను చేయనుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర వైవిధ్యభరితంగా వుంటుందట. ఈ పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని నేరుగా సూర్యనే ఆయనతో మాట్లాడి ఒప్పించాడట. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమా వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.      
mohanbabu
surya

More Telugu News