Chandrababu: 5 వేల కోట్ల రుణం మంజూరుకు చంద్రబాబుకు హామీ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ ఈడీ

  • చంద్రబాబుతో భేటీ అయిన ఇండియన్ బ్యాంక్ ఈడీ
  • రుణం మంజూరుకు సత్వరమే చర్యలు తీసుకుంటామంటూ హామీ
  • ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందంటూ కితాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంకే భట్టాచార్య ఈరోజు కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఎంవోయూ మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వరమే చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకు భట్టాచార్య హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో కేరళ వరద బాధితుల సహాయార్థం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒక్కరోజు వేతన విరాళం రూ. 14,83,336 చెక్కును భట్టాచార్యకు చంద్రబాబు అందించారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని కోరారు. భేటీ అనంతరం మీడియాతో భట్టాచార్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
Chandrababu
indian bank
executive director
meeting

More Telugu News