Jagan: నేడు జగన్ మ్యారేజ్ డే... వెరైటీగా ట్వీట్ చేసిన రోజా!

  • సీతమ్మ వంటి భారతమ్మ జగన్ కు దొరికింది
  • రాముడు వంటి జగనన్న భారతమ్మకు దొరికాడు
  • శివపార్వతుల్లా కలసి ఉండాలన్న రోజా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు మ్యారేజ్ డే జరుపుకుంటుండగా, ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్, భారతిల పెళ్లి నాటి ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన రోజా, సీతమ్మ వంటి భారతమ్మ జగన్ కు దొరికిందని అభిప్రాయపడ్డారు.

"సీతమ్మ లాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడు లాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతమ్మకి... ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలి అని మనసారా కోరుకుంటన్నాము...!!!" అని వ్యాఖ్యానించారు రోజా.
Jagan
Bharati
Marriage Day
Roja
Wishes

More Telugu News