Madhya Pradesh: కుప్పకూలిన కోట పైభాగం.. శిథిలాల్లో చిక్కుకుని డోడియా రాజమాత దుర్మరణం!

  • మధ్యప్రదేశ్ రత్లామ్ లో దారుణం
  • ఒక్కసారిగా కూలిన కోట పైభాగం
  • ప్రాణాలు విడిచిన రాజమాత జ్యోతికుంవర్
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి రత్లామ్ లోని గఢ్ మొహల్లాలో ఉన్న డోడియా రాజమహల్ లో ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి రాజమహల్ లో కొంత భాగం కుప్పకూలిపోవడంతో డోడియా వంశం రాజమాత జ్యోతికుంవర్ డోడియా(85) ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీద పడడంతో లేవలేక అక్కడే తుదిశ్వాస విడిచారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాజమాత ఒక్కరే కోటలో ఉన్నారు. ఆమె కుమారుడు రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి పనివారు విధులు ముగించుకుని వెళ్లిపోయాక కోటలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో రాజమాత సహాయకురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటిన వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రాజమాత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Madhya Pradesh
rajamata
jyotikumvar dodia
dead

More Telugu News